Friday, March 13, 2009

నీవు ఏమి చేయు చున్నావు ?

ప్రియమైన నాభిడ్డా నీకు నా శుభములు . ఈ దినమున నేను నిన్ను అడుగుచున్నాను * నీవు ఏమి చేయుచున్నావు * ?. నీవు ఏమి చేపుతావో వినాలని వుంది . నీ సమాధానముకోరకు ఎదురు చూస్తున్నాను.

నేను ఏమి చేయుచున్నాను : నా ప్రభువా నాదేవా ఏది నా సమాధానము.
  1. నాకు ఒక ప్రత్యేకమేనా గుర్తింపు కావాలని కోరుచు నాది అనే సామ్రాజ్యమను నేను సృస్త్తిన్చుకోనినాను.
  2. అందరు నామాటలు వినాలి, నాకు విధేయులు కావాలి .
  3. నేను భాగా డబ్బు సంపాదించాలి ముందు ముందు నాజీవితం ప్రశాంతంగాను మరియు ఆనందంగాను వుండాలి అందుకే ఇప్పటినుంచే కష్టపడుచున్నాను.
  4. నూతనమైన ప్రణాలికలను రుపొందిన్చుకుంటూ దురప్రాంతములకు వెళ్ళుచున్నాను.
  5. నా పనులను ఎవరైనా విమర్శించినా , అనవసరమైనసలహాలను ఇచ్చినా నాకు చాలా కోపం వస్తున్నది.
  6. నేను నడుస్తున్న మార్గములను నా విజయములను నా కుటుంబసబ్యులకు, స్నేహితులకు , బంధువులకు చెపుతూ నా సమయమును వారితో ఎక్కువగా గడుపుచున్నాను .
  7. నేను నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి న మార్గములను చూపిస్తూ నడిపిస్తున్నాను .
  8. అనారోగ్యముతోను , ఆర్ధిక సమస్యలతో వున్నా వారికి నా వంతు సహాయం చేస్తున్నాను అదియు వారు దానికి అర్హులు ఐయితేనే .
  9. నాకు అస్సలు సమయమే సరిపోవటం లేదు.
  10. నేను దేవుని దగ్గరికి వెళ్ళలేక పోవుచున్నాను. నాపనుల ఒత్తిడి రోజు రోజుకి పెరుగుచున్నది కనుక దేవునితో సమయం వేచిన్చలేకపోవుచున్నాను. అందుకే దేవునికి ఎప్పుడో ఒక్కసారి కృతజ్ఞతలు తెలిపి నాపనిని నేను చేసుకుంటున్నాను.

Friday, March 6, 2009

యెహోవా సమాధానము- నీవు ఎక్కడవున్నావు

ప్రియమైన బిడ్డా నీ సమాధానమును నేను వినియున్నాను. నీవు నేను ఇక్కడే వున్నాను అంటున్నావు కాని
  1. నీవు నాకంటికి కనిపించటము లేదు : నేను నిన్ను ఎన్నుకొని (లేక ) ఏర్పరచుకోనినాను. నీకొరకు ప్రత్యేకముగా విందును ఏర్పాటు చేసినాను. దానిలో నీవు నాకు కనిపించుటలేదు . ( విందు అనగా ప్రత్యేకమేనా స్థానము ).
  2. వేనిని నేను స్వీకరించలేదు - అవి నాకు వద్దు అంటున్నావు : నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తూ వుంటే నీ పిలుపు కాని నీవు నాకు ఒసగే బహుమతులు కాని నాకువద్దు , అవి నేను స్వీకరించాను అని నానుంచి నేవు పరిగేడుచున్నావు. నీ అంతట నీవు సంపాధించుకుంటాను అంటున్నావు.
  1. నాకు ఎవ్వరి స్వరములు వినపదతులేదు :ప్రియబిడ్డా ఇప్పుడు నాకు ఎవ్వరి స్వరములు వినపడటం లేదు అంటున్నావు అందుకుకారణము
    నా స్వరము వినవలసివస్తుందని దొంగలా దాకొంట్టున్నావు.
  2. నేను నిన్ను చేయవదు అన్నా ప్రతి పనిని నీవు చేస్తున్నావు.
  3. నాకునావాళ్ళు చెప్పినదే వేదం అదే నేను పాటిస్తాను అనే స్వార్ధం నీలో బాగా నిండిపోయింది .
౪ ఒకరిని ఒకరు దుశించుకోనుతం ద్వేషించుట అవిశ్వాసం కోపం , పగ , అసూయా, అవిధేయత దొంగతనము అనేవి రోజు రోజు కి నీలో పెరిగినై కనుకనే ఇప్పుడు నీకు ఎవ్వరి స్వరములు వినపడటం లేదు.

  • నీవు ఎక్కడికి వేల్లుచున్నావో తెలియకుండా పరుగులు తీస్తున్నావు : నీవు కావాలని ఎన్నుకొనిన మార్గం నిన్ను కొన్ని దినములు వరకు సంతోషం గా ఉండనిచినది అంటే ఆ మార్గములో నీవు ఆనందం , హాయ్ , సుక్యం ఉన్నాయ్ అని తలంచి వెళ్ళినావు నీదగ్గర ఉన్నది కర్చు ఐ ఎంత వరకు నీవు అనుకున్నవి అన్ని నీవి ఐనై దానికోసం నీవే కాదు నీ స్నేహితులను, కుటుంబసబ్యులను , బంధువులను కుడా తయారుచేసుకోనినావు , పరుగులు పెటినావు. వద్దు అనిన వారిని హింసించి , గాయపరచి నీ అనే ప్రపంచములోకి పరుగులు తిసినావు.

  • నీకు ఏమి ఆలో తెలియటం లేదు మరియు అన్ని నిన్ను ముంచివేసినై : నీవు నమ్మిన ప్రపంచంలో నీడగ్గరివి ఐపొఇనతరువాతన ఏమి చేయాలో నీకు అర్ధం కావటం లేదు. నీవు నాకు మంచిగా వున్నది , లాభం అనుకున్నవి అన్ని నీ నుంచి చెగరిపొఇనాఇ . నీను ముందు తినటానికి లేదు, ఉండటానికి నివాసము లేదు మరియు ధరించుటకు వస్త్రములు లేవు ఇది ఇప్పటి నీ స్థితి .
  • నీలో ఏమి వినినను మరియు చూసినాను ఆందోళన , ఆవేదన : మీరు నమ్మి నివసిస్తున్న చోటులో జరుగుచున సంగటనలను చూచి , విని ఎక్కువగా కలత చెండుచున్నావు, ఆవేదన నీలో రేపటిని గురించియా ఆస లేదు, నేడు ఎలా అనే ఆందోళనా , అభద్రతభావము మరియు అనారోగ్యం ఇవి అన్ని నీవు కోరి కోరి వరించిన బహుమతులు. ఏమి జరుగుతుందో అనే భయం ఒకటి వీనితో నీ పతనమును నీవే కోరి కోరి వరించినావు నా బిడ్డా.

  • నీ మనస్సు సున్యం - నీ శరీరం నీ అధీనంలో లేదు : ఇప్పుడు ఏమి చేయాలి అనే తలంపులే లేవు నీలో ఏమి చేయలేని బలహీనత , శరీరం సహకరించదు, శరీరం నిండా వ్యాధులే అవి రకరకాలు. ఒక్క నిమిషం కుర్చోలేవు, నిలబడలేవు మరియు పండుకోని నిశ్చింతగా నిద్ర పోలేవు. నీ సారీరక భాధలు మనసులోని ఆలోచనలను హరించి వేసినై . ఇంక నీలో నెమ్మది ఎక్కడ నా బడ్డా.

  • నీకు దారి చూపించే వారె లేరు : ప్రియ భిడ్డా నాకు ఎవరేనా దారి చూపించండి అని అక్రోసితున్నావు కాని ఎవ్వరు నీకు మార్గం చూపిస్తారు . నీ చుట్టూ ఉన్నవారు అందరు నీకు లానే అనుఘదియన ఆలొచిస్తూ వారు నీవు వెళ్ళిన మార్గములో నడచి పడిపోఇనవారే . మీరు ఇద్దరు కలసి చేస్తున్న పని మరీ హేయము మరియు నీచమైనది . అది తాయెత్తులు, మంత్రాలు , చింతకయలును . మరియోక్కసారి నీవు ఎన్నుకొన్న మార్గం బాబాలు , తాయెత్తులు, మంత్రాలు. సరే నీవు నన్ను అడగలేదు నా చెంతకు రాలేదు. ఇంకోక్కసారి అడ్డదారిన వేల్లుచున్నావు. కానీ ఎప్పటికి అయినా నీవు నాచెంతకు రావలసినదే నాకుమారి , నా కుమారుడా.









Saturday, February 21, 2009

నీవు ఎక్కడ వున్నావు?

నా ప్రభు, నా దేవా ఇది నా సమాధానము.
  1. నేను ఇక్కడ వున్నాను.
  2. నా కోసం ఏర్పరచిన వాటిని నేను స్వీకరించకుండా నీకు దూరంగా వెళ్ళిపోయాను మరియు అన్నింటిని చేగార్చుకున్నాను.
  3. ఇప్పుడు నాకు ఎవరి స్వరములు వినిపించత్తము లేదు. వినపడనంత దూరములో వున్నాను.
  4. ఎక్కడికి వేళల్లో తెలియటము లేదు , నాది నా జీవితము అని పరుగులు తీస్తున్నాను.
  5. నాకు ఏమి చేయాలో తెలియటము లేదు , నేను నమ్మినవి అన్ని నన్ను ముంచివేసినాయి .
  6. నాలో భయం , దేనిని చూసినా , ఏ విషయం విన్నా ఆందోళన కలుగుచున్నది.
  7. ఇక్కడ ఏమి జరుగుచున్నదో అర్ధం కావటం లేదు.
  8. ఇక్కడ నాకు దారి చూపే వారె లేరు.
  9. నా సరిరం నా అధీనం లో లేదు.
  10. నా మనస్సు అంత సున్యం .

ఇది ఇప్పటి నాయొక్క స్థితి ఈ శితిలో నేను ఎటువేల్లలేక , ఏమిచేయలేక మట్టి ముద్ద లా నెలకి కరచుకొని పదియున్నాను.

Friday, January 9, 2009

యెహోవా సమాధానము - నీవు ఎవరు ?

ప్రియమైన నా కుమారి నా కుమారుడా నీయొక్క సమాధానమును వినియున్నాను. నీవు నీ హృదయన్తరంగంనుంచి కాదు చెప్పినది.
నేను అడిగిన ప్రశ్నకి నీ గురించి నేను చెపుతాను వినుము.

  1. నేను ఆనే అహంకారముతో నిండిన హృదయము మరియు గర్వపు మాటలతో నిండిన మనస్సు కలదానివి నీవు.
  2. నాది అనే స్వార్ధంతో నిండిన కపట హృదయము కల వ్యక్తివి నీవు.
  3. నాకు అవి కావాలి మరియు యివి కావాలి అనే ఆసపోతువి నీవు.
  4. నేను మంచిదానను మరియు మంచివాడను అని గొప్పగా డంభికములు పలికే వ్యక్తివి నీవు.
  5. నాకు కావలసినవి అన్ని వున్నాయి , నీకు లేవు అని ఎదుటివారిని మాటలతో హింసించి , దూషించి మరియు ద్వేషిస్తూ హ్రుధయానందమును పొందే అసహనానివి మరియు పగవి నీవు.
  6. నాకు ఏమి లేవు, కాని ఎదుతువరికి అన్ని వున్నాయి అనే ఈర్ష్య అసుయలను నీ హృదయమునందు నింపుకొనిన వ్యక్తివి నీవు.
  7. నేను అందరికి మంచినే చేస్తాను కాని నన్ను ఎవ్వరు అర్ధంచేసుకోరు అని పలుకుతూనే ఎదుటివారి నాశానమును కోరుచున్న దొంగవి మరియు అబద్దానివి.
  8. నీకు కావలసిన వాని అవసరములకోరకు నీవు మంచిగా నటిస్తూ అవసరములు తిరినతరువాత ఎదుతివారిపీ అకారణంగా ద్వేషమును , అసహనమును , పగను మరియు ఈర్ష్యను నీలో నింపుకొని నేన్ను నీవే నాశనము చేసుకొంటున్న వ్యక్తివి.
  9. నీవు పాపమనే అంధకారమును నీలోనినికి ఆహ్వానించినది చాలక అదే మార్గములో నీ తోటి వారిని నడిపిస్తున్న దుర్మర్గుడివి మరియు దుష్టుడివి.

ఏమిటి నా కుమార నీ ముఖము చిన్నబుచ్చుకొంటివి . నా కుమారి నీవు కూడాను. మీకు కోపము ఎలా ? నేను మీ గురించి పలికినఈమాటలో ఆయినా లోపము లేదు . మీరు మీ హృదయమునందు, మనస్సు నందు తలంచి చేయుచున్న పనులు ఎవిఎగాదా . నీవు సత్క్రియలు చేసినయెడల తల ఎట్టుకోనవా? సత్క్రియలు చేయని యెడల వాకిటనే పాపమూ పొంచివుండును. నీయెడల దానికి వాంఛ కలుగును. నీవు పాపమునుఎలుధువు ( ఆదికాండము) ఈ భావములు మీ Hరుదయములోను మనస్సు లోను వున్నప్పుడు నా బిడ్డా నీలో ఆనందం ఎక్కడ వుంటుంది? నీలో ప్రతిగాదియన భయమే కదా? నీలోని భయమే ఎప్పుడు వేలితిగాను , భాధగాను, అసహనముగా నీ మాటలు ద్వారా బయల్పడుచున్నాయీ. నీలో తృప్తి అనేది ఉండటంలేదు , అశాంతి నీడలా వెంతాడుచున్నది.

నా కుమారా నా కుమారి నీవు నన్ను నీ హృదయములోనికి రమ్మని పాడుచున్నవే పాటను " రావయ్యా యేసు స్వామి వేచియున్నాను నీవే నాకు శరణమని నముచున్నాను " " నన్ను అభిషేకించు , నన్ను అభిషేకించు " , " నన్ను వాడుకోండి మీ పనికి " అని పాడుచు పిలుస్తున్నావు కాని నీపాట నాకు అసంపూర్ణంగా వినిపించుచున్నది. నీ హృదయములోనికి రండి రండి అంటున్నవేగాని నీ హృదయములో శుద్ధి లేదు , నీ మనస్సులో ఆనందం అస్సలు లేదు మరియు నీ హృదయ తలుపులును మూసివేసి ** రావయ్యా నా తండ్రి , రావయ్యా నా యేసయ్య నాలోకి నేను నీకోసం వేచివున్నాను ** అని అడుగుచున్నావు నన్ను

** నేను ఎక్కడికి రావాలి ** మరియు ** నేను ఎక్కడ వుండాలి **

ప్రియ కుమారా నా కుమారి మీరు ఈప్పుడు అయినా నాతో చెపుతావా దేవ నేను * అహంకారిని * నేను * గర్వమును * నేను * అసూయను * నేను * ద్వేషమును * నేను * ఈర్షను * నేను * అసహనమును * నేను * పగను * మరియు నేను * దొంగను * అన్ని నాలో వున్నాయి. నాలోని ఈభావములు అన్ని నన్ను ఎటు తిసుకువేలుచున్నాయో కూడా నాకు తెలియటం లేదు అని నాతో ధైర్యంగా నాముందు ఒప్పుకోనగాలవా? మరియు నేను ** దుమ్మును ** మరియు **భుదిదను** అని చెప్పగలవా నీవు ?

ఈవి నీగురించి నా సమాధానము నా కుమారి నా కుమారుడా ఇందులో ఏది తప్పులేదు మరియు కొట్టివేసేడివి ఏమియును లేవు . నీవు ఎవరు నీలోని లోపములు అన్నియును నీవే సరిచేసుకోవాలి. మరి నేను నీపిలుపుకోరకు నిరీక్షిస్తున్నాను . పిలుస్తావా నన్ను నీలోకి.

*** నీకు నా ఆశిర్వాధములు మరియు నా శుభములు ***

**********************************************

Saturday, December 27, 2008

నీవు ఎవరు?

ప్రియమైన బిడ్డలారా ఈ దినమున నేను నిన్ను అడుగుచున్నాను ** నీవు ఎవరివి ** అని . నాకు నీయొక్క సమాధానము కావలయును. నాకు చెపుతావా నీసమాధానము నేను ఎదురు చూస్తున్నాను.

నీవు ఎవరు?.
************* నా తండ్రి , నా దేవా నా సమాధానము.

  1. నేను నేనే .
  2. నాలో ప్రేమ, జ్ఞానము కొద్దిగా ఉన్నాయీ . వీనిని ఉపయోగించుకొని నా గురించి నేను అందరికి తెలియచేయుటకు నాకు వీలున్న ప్రతి మార్గమును ఎన్ను కుంటూ వడుకోనుచున్నాను.
  3. నేను నీతిమంతుడను, నీతిమంతురాలిని ఎటువంటి తప్పులు నేను చేయను.
  4. నేను అనుక్షణము అందరికి నాకు చేతనయినంత సహాయమును చేస్తున్నాను.
  5. నా తో నా దేవుడు ఎప్పుడు ఉన్నారు మరియు నన్ను నడిపిస్తున్నారు.
  6. నాకు కోపం, గర్వం, పొగరు, అహంకారం ఆస్సలు లేవు
  7. నేను ఎప్పుడు అందరికి మంచి మార్గమును చుపిస్తుంటాను.
  8. ఎన్నడు ఎవ్వరిని దుషించలేదు మరియు ద్వేశించలేదు.
  9. ఎదుటివారిని చూచి నేను ఎన్నడు అసుయపదలేదు మరియు గాయపరచలేదు.
  10. నేను ఎన్నో విలువైన కానుకలను నా దేవునికి ఎప్పుడు సమర్పిస్తుంటాను.
  11. దేవుడిని నాలోకి రండి, నన్ను మీ ఆత్మతో నింపి నన్ను వాడుకోండి అని ఎప్పుడు అడుగుచున్నాను.
  12. ఎప్పుడు నేను ఆనందంగా ఉంటాను .
  13. అపుడప్పుడు నా సమస్యలు నన్ను బాధిస్తున్నాయి కానీ నా సమస్యలు ఎదుటివారి తో పోల్చినప్పుడు నవి చాలా కొద్ధిమత్రమే అని నేను చాలా గర్వంగా వుంటాను మరియు నాకు సమస్యలే లేవు అని పిస్తుది
  14. నా దేవున్ని నా పాటలు ద్వారాను మరియు నాయొక్క స్తుతుల ద్వారా స్తుతిస్తూ తండ్రి దేవుని దగ్గరికి వెళుతూ వుంటాను.

Sunday, December 7, 2008

యెహోవా పరిచయము

ప్రియమైన నా బిడ్డలారా ఎప్పుడు నా గురించి నీవు అడుగుతావా అనీ నీయొక్క మాట కొరకు ఎదురుచూస్తున్నాను. నీవు నా గురించి తెలుసుకోవాలి మరియు నీవు సరిఅయిన నిర్ణయము తీసుకోవాలి . అది నీ జీవితమునకు చాలా అవసరము ఎందుకు అనగా ముందుముందు నీ జీవితము లో చాలా నిర్ణయములు తీసుకుంటూ అడుగు ముందుకు వెయ్యాలి నీవు సావధానముగా నా మాటలను ఆలకించుము.

నేను నేనే : నేను యెహోవా ను . ఎప్పుడు మీతో వుండువాడను మరియు మీ పితరులతో వున్నవాడిని . నేనునీకు తోడై వుండి నీవు వెళ్ళు ప్రతి ప్రదేశమున నిన్ను కాపాడుచు తిరిగి నిన్ను నా లోకమునకు రాపించేదను. (ఆదికాండము).

నేను నీయొక్క తండ్రిని : నేను నిన్ను నారుపములో , నాపోలికలో నెల మట్టినుంచి తయారుచేసి నా జీవవయువును నీ నసికారంద్రములో వుఉది నీకు జీవమును పోసిన తండ్రిని (ఆదికాండము).

నేను ప్రేమను : నా ప్రేమ శాశ్వతము . కాలములు గతిన్చిపోవును ప్రవచనములు నిరర్ధకమగును కాని నా ప్రేమ తరతరములవరకు శాశ్వతముగా నిలచిపోవును. నా ప్రేమకు అంతము లేదు (ఇకోరింది ).

నేను జ్ఞానమును : నేనే జ్ఞానాధరము , పరాక్రమము నాదే . శుస్ట్టి ఆరంభామున నేను జ్ఞానమును వినియోగించి ఆనింటిని చేసినాను. నా జ్ఞానము ముత్యములకన్న శేస్త్తమయినది , నేను చతుర్యమును నాకు నివసశానముగా చేసుకొంటిని , సదుపాయములు చేయుట నాకు చేతనగును. చెడుతనము ఆసహించుకోనుత , గర్వము, అహంకారము, దుర్మర్గత కుటిలమిన మాటలు నాకు అసహ్యము , నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను (సామెతలు ).

నేను నీయొక్క సంరక్షకుడను : నేను ఎల్లప్పుడు మిమ్మల్ని కాపాడుతూ మీకు తోడు నీడగా వెన్నంటి వుండి నా రెక్కల మాటున భద్రపరుస్తూ కాపాడుచున్న నీ కాపరిని (యోహాను)

నేను నీ అవసరతలు తీర్చే వ్యక్తిని : నీవు నన్ను అడుగుము నీవు పొందెదవు , నీవు నన్నుతతుము నీకు దొరికేడను. నీకు కావలసిన ఆహారమును అనుదినము నీకు ఒసగేదను మరియు నీవు అడిగినప్పుడు నేను నీకు పరిశుధత్మను ఒసగేదను.

నేను రోషముగల వాడిని : నేను రోషముగల దేవుడను నాకు కాకా మీరు వేరొక దేవునికి మొక్కరాదు మరియు ఇతర దేవుళ్ళకు నివేధ్యముగా అర్పించిన వేనిని మీరు భుజింపరదు మరియు వణికి మీయొక్క నివేద్యములు అర్పించరదు నేను ఎహోవాని నేను తప్ప మీకు వేరొక దేవుడు వుండరాదు. మీరు నాస్వంతము , నేను మీకు దేవుడను.(నిర్గమ)

నేను దయమయుడను మరియు కరునమయుడను : నీవు నన్ను దయచుపించమని నేపిన జాలి చూపించమని అడిగినప్పుడు మరియు నీయొక్క పాపములను ఒప్పుకోనినప్పుడు ఆసమయమునందే నీపిన నేను దయచుపిస్తాను. నేను నేన్ను ఎప్పుడు కోపపదను మరియు ద్వేశిన్చను , నేవు నిన్ను తగ్గించుకొని నాచెంతకు రావాలని నేను కోరుచున్నాను అప్పుడే నేయోక్క విలువ పెరుగుతుంది (లుక).

నేను క్రుపామయుడను : నా కృప నీయొక్క ప్రతి అవసరతలు తీరుస్తుంది (కరింత్) ది పరిశుధాత్మ అయిన నేను నీకు నాయొక్క ఫలముల్య్న ప్రేమ , ఆనందము , శాంతి , సహనము , దయ , మంచితనము , విశ్వాసము , సాత్వికత , నిగ్రహముల తో నిమ్పుదును. ( గలతీ).

నేను వైద్యుడను : నేను వైధ్యులకే వైద్యుడను నీయొక్క ప్రతి అనరోగ్యమును నేను తీసుకొని నాయోక్క స్వస్థతతో నింపుచున్నను.( లుక)

నేను భోధకుడను : నీయు నివసిస్తున్న ఈలోకమును గురించి నీకు ఏమి తెలియదు , మంచి ఏమిట్టి , చెడు ఎలా జరుగుతుందో నీకు తెలియదు , నీవు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలో తెలియదు అంతేకాదు నీకు ఏవిధముగా ప్రార్దించాలో తెలియదు వీనిని అన్నింటిని నేను నీకు ఎప్పటికి అప్పుడు భోధిస్తూ నిన్ను నడిపిస్తున్నాను.

నేను రక్షకుడను : నేను నిన్ను రక్షించాలని నాయొక్క ప్రియమైన కుమారుడిని నీకొరకు నీవు నివసిస్తున్న లోకమునకు పంపినాను. నా కుమారుడు లోకమునకు వచినది మీఖు తీర్పును తిర్చుటకు కాదు వచ్చినది . కేవలము నిన్ను మాత్రమే నే పపములనుంచి కాపాడాలని మరియు నీకు నూతన జీవితమును ఒసగాలని , నిన్ను నడిపించుటకు పంపినాను. నా కుమారుని నామము ** ఇమ్మనుయేలు ** . అనగా దేవుడు మనతో వున్నాడు అని అర్ధము.

నేను నీకు ఏమి చేయాలనీ నీవు కోరుచున్నావు? లేదా మీరు నానుంచి ఏమి ఆసించుచున్నారు?

ప్రియమైన భిద్ద లారా మీకు నేను ఎవరినో వివరించినాను.ఇప్పుడు నేను మిమల్ని అడుగుచున్నాను మీరు నానుంచి ఏమి కోరుచున్నారు. మీరు కావాలని ఎదురు చూసే సహాయము ఏది అయినా ఎలా వుండాలో, ఏవిధంగా అడగాలి మీకు తెలియచేపుతాను.

  1. నా యొక్క అవసరతలు నా దేవుడు నెరవేరుస్తారు అనే నమ్మకము, విశ్వాసము ముందు మీలో మీరు ఏర్పరచుకోవాలి.
  2. నీవు కావాలని కోరుచున్న అవసరత ఏది అయినా స్పష్టంగా వుండాలి మరియు వినయముతో అడగాలి.
  3. నీయొక్క అవసరతల భారము అంతయు మీదేవునికి అప్పగించాలి అంతే కాని అవి నీ దేవున్ని సాసీన్చరాదు.
  4. నీయోక అవసరతలు అనేవి ఎదుటి వారికి హాని కలిగించేవిగానూ మరియు గాయపరచేవిగాను వుండరాదు.
  5. నీవు కావాలని అడిగే సహాయము ఎదుటివారిని ద్వేశించేవిగాను మరియు దుశించేవిగాను వుండరాదు.
  6. నీ యెక్క అవసరములు అడిగేతప్పురు మీ స్నేహితులు , బంధువులు, సోదరులు, సోధరిమనులఫైనమ్మకము వుంచి కాదు నన్ను అడగవలసినది.

    మీరు మీస్వరములను ఎత్తి దేవా నాపి జాలి చూపండి నన్ను కరున్నించండి నాఈ శితి నుంచి మీరు ఒక్కరే నన్ను కాపాడగలరు అని హృదయన్తరంగామునుంచి ఎలుగెత్తి ప్రార్ధిస్తూ స్పష్టముగా విశ్వాసముతో అడగండి . ఆ ఘదియనే తండ్రిగా నేను నా హస్తమును చాపి మీ అవసరములు అన్నియును నెరవేరుస్తాను. గుర్తువుంచుకో నా బిడ్డ నీవు ఆశించేది ఏది అయినా కోరినది నెరవేర్చుటకు నేను సమర్దుడను ఆమెన్. నాకు అసాద్యమేనది ఈ భూమిలో ఏదియును లేదు ఆమెన్.


నేను మీనుంచి ఏమికోరుచున్ననో తెలుసునా?

ప్రియమైన నా కుమారి నా కుమారుడా నాకు కొన్ని కోరికలు వున్నాయి . అవి

  1. నీ హృదయములో స్థానము కావాలి : నాకు నీహృదయములో చోటుకావాలి అందులో నేను నివాసమును ఏర్పరచుకుంటాను మరియు నీతో సహవాసము చేస్తాను. ఇది నా మొదటి కోరిక.
  2. నాకు నీ మనస్సు కావాలి : నీ మనస్సు నన్ను ప్రేమించాలి, ఎల్లప్పుడూ నాచుతూ తిరుగుచు నాకోసం తపించాలి నాగురించి అడగాలి. ఇది నా రెండవ కోరిక.
  3. నాకు నీ ఆత్మ కావాలి : సృష్టిలో మొదటగా అత్మనుకలిగి జీవించుచున్నది మీరు మాత్రమె. జంతువులకు పక్షులకు ఆత్మలేదు మరివు దూతలకు సేరిరము లేదు వణికి ఒసగినది ఆత్మను మాత్రమే. మీరు దేహమును మరియు ఆత్మను కలిగినవారు. నీయోక ఆత్మ నేను ఒసగిన బహుమానము. నీ ఆత్మ నాచెంతకు చేరవలసినది కనుక నీవు నీ ఆత్మను నాసనముచేయుతకు నేను ఇష్టపడను, నీ ఆత్మ నాది ఇది నా మూడవ కోరిక.
  4. నాకు నీయొక్క స్తుతులు మరియు కృతజ్ఞతలు కావాలి : నీవు నానుంచి పొందిన ఆశిర్వదమునకు ఆనందమునకు నాకువందనములు తెలుపుతవని మరియు నీయొక్క సంతోశములో నేను పాలుపంచుకోవాలని ఎదురుచూస్తుంటాను. నీవు చెప్పే స్తుతులు మరియు కృతజ్ఞతలు నాకు చాలా ఆనందమును ఇస్తాయి . వానిని ఆలకించిన నేను నీకొరకు ఇంకా గొప్ప కార్యములు చేసేలా నన్ను కరిగిస్టై . కనికరముతో నీకి నేను తపించేలా చేస్తాయి . ఇది నేను నీనుంచి ఆసించుచున్న నాచివారి కోరిక.

ప్రియ భిద్దలారా నేను మేమల్ని నా కుమారుడా నాకుమారి అని ఎంతో ప్రేమతో పిలుస్తు నిన్ను నాచెంతకు రమ్మని నాచేతులు నీవయిపు చాపి ఆహ్వానిస్తున్నాను. మరి నా పిలుపును స్వికరిస్తావా నిర్ణయము నీదే.ఈలోకములో జీవించటానికి నీకు వున్నా సమయము చాలా తక్కువ. గడచిన సమయము వెనక్కి రాదు, రేపటి రోజు నీది కాదు కనుక జీవిస్తున్నా ఈరోజే నీది. నాయోక రెండవ రాకడ అతి సమీపముగా వున్నది. నీవు నీకు ఏమి కావలయునో త్వరగా నిర్నయించుకోనుము. నీఒక్క రాకకై నేను యెహోవాను ఎదురుచూస్తున్నాను.

Saturday, December 6, 2008

పరిచయము

తండ్రి , కుమార , పరిశుద్ధాత్మ నామమున ఆమెన్ .

ప్రియమైన సహోదరి సహోదరులకు దేవునే నామమున న వందనములు. సహోదరి సహోదరులారా ఈ దినము నేను మీ అందరితోను మాట్లాడాలని వేచివున్నాను. మరి మీ సమయమును కొద్దిగా నాకు ఒసగుమని మేమ్మల్నీ బ్రతిమలడుచున్నను.

ప్రియమైన న స్నేహితులారా మీరు ఎప్పుడు ఆయినా మనము ఈస్త్తపడుచున మన దేవుడు ఎవరు , ఆయన గుణములు ఏమిటి , ఆయన ఎక్కడ వుంటారు , అయన ఏమి చేసినారు , చేయు చున్నారు , మనలనుంచి ఏమి కోరుచున్నారో ఎప్పుడు అయేన ఆలోచన చేసినావా?

ప్రియమైన నా స్నేహితులారా ఈప్పుడు అయేన నీవు నీ దేవుని గురించి తెలుసుకోవాలి ఎందుకు అనగా నీవు ఏ
మతమునకి చెందినా వ్యక్తివి అయేన సరే నీ దేవుని గురించి పూర్తిగా తెలిసి వుండాలి . నిన్ను ఎవరు అయేనా నీ దేవుని గురించి చెప్పు అనే ఆడిగితే ఏమని చెప్పగలవు.

నా స్నేహితుడా , స్నేహితురాల నేను అయెతే నా దేవుడు ఈయన , నా దేవుని లక్షణములు , మరియు అయన నాకోసం ఏవి చేసినారు , చేయుచున్నారు , నేను నా దేవుణ్ణి నమ్ముచున్నాను , ప్రేమిస్తూన్నాను ఆయనను విశ్వసిస్తున్నాను అనే గర్వంగా చెప్పగలను. మరి నీవు నాలా చెప్పగలవా?